మహాత్మా గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్తాం : మంత్రి పొన్నం - Ponnam Visited Municipality
🎬 Watch Now: Feature Video
Published : Jan 30, 2024, 12:36 PM IST
Minister Ponnam Pays Tributes To Mahatma Gandhi : మహాత్మా గాంధీ ఇచ్చిన స్వచ్ఛత కార్యక్రమాన్ని వృత్తిరీత్యా, బాధ్యతగా నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్, అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Minister Ponnam Prabhakar Visited Husnabad Municipality : ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్వచ్ఛత అవార్డులు రావడంలో కృషి చేసిన పారిశుద్ధ్య కార్మికులను నూతన వస్త్రాలు, శాలువాతో పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. పట్టణ పరిశుభ్రతలో ప్రజలందరూ కూడా భాగస్వాములైతే పారిశుద్ధ్య కార్మికులకు సహకరించి వారిని గౌరవించినట్లేనని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పట్టణంలో కాలుష్య నివారణ, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణతో ప్రజలందరి ఆరోగ్యం కోసం మున్ముందు అవసరమైన కార్యక్రమాలు తీసుకుంటామని వెల్లడించారు. మహాత్మా గాంధీ ఇచ్చిన శాంతి, గ్రామాల అభివృద్ధి, సర్వమత సమ్మేళనాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని తెలిపారు.