LIVE : కేబినెట్ భేటీ వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - Minister Ponguleti Press Meet - MINISTER PONGULETI PRESS MEET
🎬 Watch Now: Feature Video
Published : Sep 20, 2024, 8:32 PM IST
|Updated : Sep 20, 2024, 8:50 PM IST
Minister Ponguleti Srinivas Reddy Press Meet : సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారులు, రైల్వే లైన్లు ధ్వంసం కావడంతోపాటు భారీ ఎత్తున పంట నష్టం సంభవించింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో ప్రజలు కట్టుబట్టలతో బయట పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలు వస్తాయని వాతావరణశాఖ చేసిన హెచ్చరికతో ప్రభుత్వం అప్రమత్తం కావడంతో చాలా వరకు ప్రాణనష్టం జరగకుండా అధికారులు నిలువరించగలిగారు. అలాగే తెలంగాణలో మూడు విశ్వవిద్యాలయాల పేర్లను కూడా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై కేబినెట్లో చర్చించారు. అలాగే హైడ్రాను పటిష్టపరిచే విధంగా చర్యలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. హైడ్రాను పటిష్ట పరిచేందుకు పోలీసులు, పోలీస్ స్టేషన్ వంటివి కావాలి. అలాగే మూసీ నదిని సుందరీకరించేందుకు కేబినెట్లో చర్చించారు.
Last Updated : Sep 20, 2024, 8:50 PM IST