పదేళ్లలో బీఆర్​ఎస్ పేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేసింది : మంత్రి పొంగులేటి - Minister Ponguleti about BRS

By ETV Bharat Telangana Team

Published : Jun 3, 2024, 3:35 PM IST

thumbnail
పదేళ్లలో బీఆర్​ఎస్ పేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేసింది : మంత్రి పొంగులేటి (ETV Bharat)

Minister Ponguleti Srinivas Reddy on BRS : గత ప్రభుత్వం పదేళ్లలో పేదవారికి ఇళ్లు గానీ, రేషన్ కార్డులు గానీ, పెన్షన్లు గానీ ఇవ్వకుండా మోసం చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. కానీ కాంగ్రెస్​ అలా కాదని పేదల పక్షాన నిలబడి ప్రతి పేదవాడికి అన్ని సౌకర్యాలు కల్పించి అందరూ బాగుండాలని కోరుకుంటోందని చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ప్రజల వద్దకే మీ శీనన్న కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. 

ఈ క్రమంలో కొత్త కొత్తూరు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో మంత్రి పొంగులేటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు గ్రామాల్లో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కాంగ్రెస్​ వచ్చింది కరవు వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి అంటున్నారని మరి ఇప్పుడు రోహిణి కార్తెలో కూడా మంచి వర్షాలు పడుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను కాంగ్రెస్​ అమలు చేస్తోందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతోందని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.