విజయవాడ వరద విలయానికి గత ప్రభుత్వమే కారణం : మంత్రి నిమ్మల - Minister Nimmala About Budameru - MINISTER NIMMALA ABOUT BUDAMERU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2024, 4:08 PM IST
Minister Nimmala Ramanaidu About Budameru : విజయవాడ వరద విలయానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ క్రమంలో వరదలకు కారణమైన బుడమేరు నిర్వహణను ఐదేళ్లలో పూర్తిగా గాలికి వదిలేశారని విమర్శించారు. బుడమేరు గండ్లు బలహీన పడటం వలన మూడు భారీ గండ్లు పడి విజయవాడకు వరద వచ్చిందని చెప్పారు. బుడమేరు గండి పడిన ప్రాంతం వద్ద మంత్రి నిమ్మల దగ్గర ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు మండిపడ్డారు. బుడమేరు అభివృద్దికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మిగతా 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి. సాధ్యమైనంత త్వరగా గండ్ల పనులు పూర్తి చేస్తామంటున్న మంత్రి రామానాయుడుతో ఈటీవీ ప్రతినిధి సూర్యరావు ముఖాముఖి.