వైసీపీ పెద్దల లాభం కోసమే జగనన్న కాలనీలు : మంత్రి నాదెండ్ల మనోహర్ - problems of Jagananna colonies - PROBLEMS OF JAGANANNA COLONIES

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 8:24 PM IST

Minister Manohar held Meeting With Beneficiaries of Jagananna Colonies : జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో లేఔట్​లోని లబ్ధిదారులతో మంత్రి మనోహర్ సమావేశం నిర్వహించారు. జగనన్న కాలనీలో ఎదుర్కొంటున్న సమస్యలు, పడుతున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అలాగే గృహ నిర్మాణాలను పరిశీలించి అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుచోట్ల లబ్ధిదారులు తమ గృహ నిర్మాణాలు సరిగా లేవని మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువచ్చారు. 

మరికొందరు ఇళ్ల పట్టాలు ఇచ్చారు గాని తమ కేటాయించిన ప్లాటు చూపించలేదని ఆయనకు వివరించారు. ఇంకొందరు కాంట్రాక్టర్ డబ్బులు తీసుకుని ఇల్లు నిర్మించడం సగంలో ఆపేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి లబ్ధిదారులలో అతి కొద్ది మంది మాత్రమే ఇళ్లు కట్టుకున్నట్టు కనపడుతుందనీ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదల కోసం కోసం కాకుండా వ్యక్తిగత లాభం కోసం పని చేసిందని విమర్శించారు. అలాగే భూముల కొనుగోళ్ల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కోట్లు దోచుకుందని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.