టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శిక్షణ-107 మందికి విదేశాల్లో ఉద్యోగాలు - NRI TDP Teachers - NRI TDP TEACHERS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 4:30 PM IST

Minister Kondapalli Srinivas Issues Certificates to NRI TDP Teachers : ఎన్నారై టీడీపీ వింగ్ తరుఫున అమెరికాలో టీచర్లుగా ఉద్యోగాలు సాధించిన వారికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అభినందనలు తెలిపారు. ఏపీ యువత ఎక్కడికి వెళ్లినా ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. ఇక్కడ విద్యా విధానానికి అమెరికాలో విద్యా విధానానికి తేడా ఉన్నప్పటికీ ఏపీ నుంచి వెళ్లిన టీచర్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ప్రతిభ ఉన్న యువతకు సహాయం చేయడానికి ఏపీ ప్రభుత్వం ముందు వరుసలో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సహకారంతో మరిన్ని ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు. 

ఇప్పటివరకు 107 మంది ఎన్నారై టీడీపీ వింగ్ తరపున శిక్షణ తీసుకొని విదేశాల్లో టీచర్లుగా ఉద్యోగాలు సాధించడం శుభపరిణామమన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో అమెరికాలో టీచర్లుగా ఉద్యోగాలు సాధించిన వారికి మంత్రి సన్మానం చేసి, సర్టిఫికెట్ లు అందచేశారు. 2022 సంవత్సరం నుంచి తమ వింగ్ తరపున శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఎన్నారై టీడీపీ అధ్యక్షులు వేమూరి రవి తెలిపారు. రాబోయే రోజుల్లో ఒక అమెరికానే కాకుండా యూరప్ లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వేమూరి రవి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.