మోదీకి అదానీ, అంబానీలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు : కొండా సురేఖ - lok saha elections 2024 - LOK SAHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : May 4, 2024, 4:23 PM IST
Minister Konda surekha fires on BJP : బీజేపీ ప్రభుత్వానికి అదానీ, అంబానీలపై ఉన్న ప్రేమ, దేశ ప్రజలపై లేదని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు పెద్దపీట వేస్తోందని దుయ్యబట్టారు.
బీజేపీ పాలనలో పేద ప్రజలు మరింత పేదలుగా మారుతున్నారని ఆమె దుయ్యబట్టారు. మెదక్ పార్లమెంట్ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పీడించే వారే కానీ, ప్రజలను ఆదుకునే వ్యక్తులు కాదని ఆమె మండిపడ్డారు. నీలం మధు గెలిస్తే ప్రజలకు, కార్మికులకు మంచి చేకూరుతుందని పేర్కొన్నారు. మాట ఇస్తే తప్పని వారు సీపీఎం నాయకులు అని, తమకు మద్దతు తెలుపుతున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని నీలం మధు గెలుపునకు కృషి చేయాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.