కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే సత్తా కిషన్‌రెడ్డికి లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - Minister Komatireddy on KishanReddy
🎬 Watch Now: Feature Video
Published : Feb 21, 2024, 2:25 PM IST
Minister Komatireddy Venkat Reddy Fires on Kishan Reddy : రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే బీజేపీని నామ రూపాల్లేకుండా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి కనీసం తన సొంత నియోజకవర్గానికీ ఏమీ చేయలేదని విమర్శించారు. భువనగిరి కోట మీద పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు స్వయంగా విజ్ఞప్తి చేసినా, రూపాయి మంజూరు చేయలేదని మండిపడ్డారు. ఐదేళ్ల నుంచి బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో రోడ్లను మరిచిపోయారని విమర్శించారు.Minister Komatireddy Venkat Reddy Comments on BJP : రహదారుల అభివృద్ధి, జాతీయ రహదారుల కోసం ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి ప్రధానమంత్రిని, నితిన్ గడ్కరీని కలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. సొంత రాష్ట్రానికి బడ్జెట్ నుంచి నిధులు తెచ్చుకోలేని కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ అన్నారు.