ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్ మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2024, 10:53 PM IST

thumbnail

Minister Komatireddy Venkat Reddy Fires On BRS : బీఆర్​ఎస్​పై లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రులు, కేటీఆర్‌, హరీశ్‌రావు, బీఆర్​ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా కేటీఆర్​ మాటతీరులో మార్పురాకపోవడం దారుణమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.  

Minister Komatireddy Venkat Reddy On RRR Road : ట్రిపుల్​ ఆర్​(RRR)తెలంగాణకు మణిహారం అని, అలైన్‌మెంట్‌ మార్చేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వివరించారు. ఆ విషయంపై ఇప్పటికే అధికారులతో సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ నాయకులపై మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని గులాబీ నాయకులు వ్యాఖ్యానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను తాము అమలు చేస్తామని స్పష్టం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.