రామోజీరావు సంస్మరణ సభ కోసం పటిష్ట బందోబస్తు : మంత్రి కొలుసు - Kolusu on Ramoji Memorial Service - KOLUSU ON RAMOJI MEMORIAL SERVICE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 4:36 PM IST

Minister Kolusu on Ramoji Rao Memorial Service Program : అక్షర యోధుడు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేస్తున్నారు. గురువారం నాడు కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈ సంస్మరణ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని ఆయన వెల్లడించారు. 

Ramoji Rao Memorial Meet in Tadigadapa : ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన వారు సుమారు 7,000ల మంది వరకు వస్తారని అంచనా వేశామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. రామోజీరావు అన్నదాత పత్రిక ద్వారా వ్యవసాయ రంగానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. రామోజీరావు పుట్టిన జిల్లాల్లో తాను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బంది లేకుండా పాస్​లు ఇస్తున్నామని తెలిపారు. స్థానికులు హాజరయ్యేందుకు ఎటువంటి పాస్​లు అవసరం లేదని పేర్కొన్నారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సంస్మరణ సభలో ఆయన జీవిత విశేషాలకు సంబంధించి లఘు చిత్రాలను ప్రదర్శిస్తామని కొలుసు పార్థసారథి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.