పసికందుపై అత్యాచారం చేసిన వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదు - కఠిన శిక్ష పడేలా చేస్తాం: మంత్రి సంధ్యారాణి - Minister Visit Baby Family Hospital - MINISTER VISIT BABY FAMILY HOSPITAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 7:45 PM IST
Minister Gummadi Sandhya Rani Visited Baby Family: ఆరు నెలల పసికందుపై 40 ఏళ్ల వ్యక్తి దాడి చేయడం చాలా బాధాకరమని శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. విజయనగరం ఘోషా ఆసుపత్రిలో ఉన్న చిన్నారి తల్లిదండ్రులను మంత్రి పరామర్శించారు. ఊయలలో ఉన్న పసికందుపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయకూడదని మంత్రి అన్నారు. ఏ ఆడబిడ్డకైనా అన్యాయం జరిగితే వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు గతంలోనే చెప్పారని గుర్తు చేశారు.
బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారని సంధ్యారాణి అన్నారు. ఇలాంటి అత్యాచార ఘటనలు జరుగుతున్నపుడు ప్రజలు కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఐదు సంవత్సరాలలో చాలా ఘటనలు జరిగాయని ఆడ పిల్లలు బయటకు రావాలంటే భయపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. స్కూల్, కాలేజీలకు ఆడపిల్లలను పంపించలంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారని మంత్రి తెలిపారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా సిఫార్సు చేస్తామని మంత్రి అన్నారు.