18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్థిక సాయం-'మహాశక్తి'ని త్వరలోనే ప్రారంభిస్తాం: మంత్రి సంధ్యారాణి - Discussion on Mahashakti scheme - DISCUSSION ON MAHASHAKTI SCHEME
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 26, 2024, 9:13 PM IST
Minister Sandhya Rani Spoke on Mahashakti Scheme in Assembly : మహాశక్తి పథకం ద్వారా 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. పథకం అమలు కోసం విధి విధానాలు రూపొందిస్తున్నామని త్వరలోనే జారీ చేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానంగా చెప్పారు.
రిజర్వేషన్ ప్రకారమే ఏకలవ్య పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదని ఎస్టీ సెల్ అధ్యక్షులు కోట లక్ష్మణరావు అన్నారు. అంతేగానీ అబద్దాలతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని విమర్శించడం సరికాదన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం గిరిజన సంఘం నాయకులు మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఏమైన సమస్యలు ఉంటే మంత్రి దృష్టికి తీసుకురావాలన్నారు. గతంలో ఏ మంత్రి చేయ్యని విధంగా సంధ్యారాణి గిరిజన విద్యార్ధులకు కంచాలు, గ్లాసులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారని గుర్తుచేశారు.