ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్​గా ఏపీని మార్చుతాం: మంత్రి గొట్టిపాటి - Gottipati At RE INVEST 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 9:07 PM IST

thumbnail
ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్​గా ఏపీని మార్చుతాం: మంత్రి గొట్టిపాటి (ETV Bharat)

Minister Gottipati Ravi Kumar in Investors Meet: దేశానికి ఎనర్జీ స్టోరేజ్ క్యాపిటల్​గా ఏపీని మార్చుతామని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఏపీలో పునరుత్పాదక విద్యుత్‌ ఆధారంగా ఆంధ్రప్రదేశ్​లో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్​ను అందించడమే లక్ష్యంగా తాము పని చేస్తున్నట్లు గొట్టిపాటి రవికుమార్‌ పేర్కొన్నారు. గుజరాత్‌లో నిర్వహించిన ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024లో గొట్టిపాటి రవి పాల్గొన్నారు. 

రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు. లక్ష్యాలను అందుకునే దిశగా సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్​లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు విద్యుత్‌ స్టోరేజీ సాంకేతికత కూడా వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.0 సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్‌ స్టోరేజి విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ స్టోరేజికి ఆంధ్రప్రదేశ్​ను కేరాఫ్ అడ్రెస్​గా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.