ETV Bharat / state

కార్ల నెంబర్లు మార్చి గంజాయి సరఫరా - 200 కేజీలు పట్టివేత - GANJA SEIZED BY POLICE IN NTR DIST

ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నందిగామ, చిల్లకల్లు వద్ద రెండు కారులో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Seized Ganja in NTR District
Police Seized Ganja in NTR District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 6:42 PM IST

Police Seized 200 KG Ganja in NTR District: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నందిగామ, చిల్లకల్లు వద్ద రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నందిగామ ఏసీపీ కార్యాలయంలో డీసీపీ కె.ఎం. మహేశ్వర రాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి మహారాష్ట్రకు చెందిన రెండు కార్లు, 200 కేజీల గంజాయిని మీడియా ఎదుట ప్రదర్శించారు.

మహారాష్ట్రకు చెందిన కార్లతో అక్రమ రవాణా: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా మహారాష్ట్రకు చెందిన రెండు కార్లతో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. దీనిపై పోలీసులకు పక్కా సమాచారం రావడంతో జాతీయ రహదారిపై కీసర, చిల్లకల్లు టోల్ ప్లాజాల వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేశారు. కార్లు నెంబర్లు మార్చి మరీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.

కీసర, చిల్లకల్లు టోల్ ప్లాజా నుంచి తప్పించుకున్న కార్లను పోలీసులు వెంబడించారు. అనంతరం పోలీసులను గుర్తించిన నిందితులు నందిగామ వద్ద ఒక కారు, చిల్లకల్లు సమీపంలో మరో కారును వదిలిపెట్టి పరారయ్యారు. పోలీసులు హైవేపై సీసీ కెమెరాలు, టోల్ ప్లాజాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్ విజువల్స్​తో రెండు కార్లను గుర్తుంచి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

బల్బులో డ్రగ్స్​ - బెంగళూరు టు హైదరాబాద్​ వయా గుంటూరు

చిల్లకల్లులో 20 కేజీలు-నందిగామలో 120 కేజీలు: చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కారులో 80 కేజీలు, నందిగామ వద్ద దొరికిన కారులో 120 కేజీల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టుకున్న గంజాయి విలువ 25 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. కార్లు స్వాధీనం చేసుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మహారాష్ట్రకు ప్రత్యేక బలగాలను పంపుతున్నట్లు డీసీపీ కె.ఎం. మహేశ్వర రాజు తెలిపారు.

గంజాయి డ్రగ్స్ ద్రవ్యాలను నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. దీనిలో భాగంగా ఈగల్ సంస్థను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మాదకద్రవ్యాల సమాచారాన్ని మాకు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇందులో ఏసీపీ తిలక్, సబ్ డివిజన్​లోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

"ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నందిగామ వద్ద 120 కేజీలు, చిల్లకల్లు వద్ద 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. నిందితుల కోసం మహారాష్ట్రకు ప్రత్యేక బృందాలను పంపిస్తాం. డ్రగ్స్​ను నిరోధించేందుకు ప్రజలు మాకు సహకరించాలి. మాదకద్రవ్యాల సమాచారాన్ని తెలియజేయాలనుకునేవారు టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు ఫోన్ చేయాలి." -కె.ఎం. మహేశ్వర రాజు, డీసీపీ

ఇక వారికి దబిడిదిబిడే - ఏపీలో 'ఈగల్' ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైడ్రా తరహాలో ఏపీలో 'ఈగల్' వస్తోంది బీకేర్​ఫుల్​ !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.