రాజకీయ లబ్ధి కోసమే వైఎస్సార్సీపీ ఆరోపణలు : మంత్రి డీబీవీ స్వామి - Jagan Name Remove Incident - JAGAN NAME REMOVE INCIDENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 1:10 PM IST

Dola Balaveeranjaneya Swamy on Removal of Jagans Name : విజయవాడలో డా.బీఆర్ అంబేద్కర్‌ విగ్రహం వద్ద పెద్ద పెద్ద అక్షరాలతో వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్‌ మోహన్ రెడ్డి పేరు ఉండటాన్ని ఇష్టపడని అంబేడ్కర్‌ అభిమానులు, దళిత సంఘాలు ఆ పేరును తొలగించి ఉంటారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ విగ్రహానికి అపచారం జరిగినట్లు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, కొందరు వైఎస్సార్సీపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని ఒంగోలులో నిర్వహించిన సమావేశంలో దుయ్యబట్టారు. 

అంబేద్కర్‌ విదేశీ విద్య సహా ఆయన పేరుతో ఉన్న పథకాలను జగన్‌ ప్రభుత్వం తొలగించిందని, అప్పుడు జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ నాయకులు కనీసం ప్రశ్నించలేదని మంత్రి విమర్శించారు. ఇప్పుడు వివాదం చేయడం అన్యాయమని అన్నారు. పెద్ద అక్షరాలతో ఉన్న జగన్‌ పేరును తొలగించాలని తమకు అనేక మంది నుంచి ఫిర్యాదులు అందాయని గుర్తు చేశారు. గ్రామ వాలంటీర్లను జగన్‌ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు నుంచి రెన్యువల్‌ చేయలేదని, తాము రెన్యువల్‌ చేసి, జీతాలు ఇస్తామని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.