ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు - మంత్రి ధర్మాన ప్రసాదరావు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 24, 2024, 1:52 PM IST
Minister Dharmana Prasada Rao Sensational Comments: మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇప్పిలి గ్రామంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని, 33 ఏళ్ల వయసులోనే మంత్రి అయ్యానని గుర్తు చేశారు. తనకు మరోసారి పోటీ చేయాలనే ఆలోచన లేదన్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలని తనను కోరుతుండగా దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదని మంత్రి ధర్మాన తెలిపారు.
"గత 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను. చిన్నవయస్సులోనే నేను రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టాను. 33 ఏళ్ల వయసుకే మంత్రిని కూడా అయ్యాను. మరోసారి పోటీ చేయాలనే ఆలోచన నాకు లేదు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి నన్ను ఈ ఒక్కసారికి పోటీ చేయాలని కోరుతున్నారు. కానీ నేను దీనిపై ఇంకా ఆయనకు స్పష్టతనివ్వలేదు." - ధర్మాన ప్రసాదరావు, మంత్రి