హోలీ సంబరాల్లో మంత్రి రాంబాబు - మహిళలతో కలిసి చిందులు - Ambati Rambabu dance with women - AMBATI RAMBABU DANCE WITH WOMEN
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-03-2024/640-480-21069407-thumbnail-16x9-minister.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 25, 2024, 7:34 PM IST
Minister Ambati Rambabu dance with women during Holi celebrations: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సుగాలి కాలనీలో జరిగిన హోలీ సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి చిందులేశారు. బీజీ బీజీగా ఉన్న ఎన్నికల షెడ్యూల్లో సైతం హూలీ వేడుకల్లో ఉత్సాహంగా కనిపించారు. ఈ సందర్భంగా అంబటి ఇంటి వద్దకు వచ్చిన కార్యకర్తలు మంత్రిని చూడగా గుర్తు పట్టలేనంతాగా, రంగులతో నిండిపోయారు.
పనిలో పనిగా బుల్లెట్ బైక్ పై ఎక్కి వీధుల్లో చక్కర్లు కొట్టారు. మంత్రి అంబటి రోడ్లపై బైక్ రైడ్ చేయడంతో, ఆయన అభిమానులు, నగర ప్రజలు సైతం ఆయన బులెట్ బైకును అనుసరించారు. అనంతరం నగరంలో హోలీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టారు. మంత్రి ఇంటి వద్దకు వచ్చిన గిరిజన మహిళలతో కలిసి అంబటి స్టెప్పులు వేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కి చెందిన పాటలతో పాటు గిరిజన సంప్రదాయ పాటలకు అంబటి స్టెప్పులు వేశారు.