విశాఖ సాగర తీరంలో మిలాన్-2024 విన్యాసాలు - ఆకట్టుకున్న యుద్ధనౌకలు - Milan 2024 celebrations in Vizag
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 10:51 PM IST
Milan-2024 celebrations at Visakhapatnam RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌లో మిలన్-2024 వేడుకలు ఘనంగా జరిగాయి. మిలాన్ 2024 సందర్భంగా విమానాలు గాలిలో దూసుకెళ్తూ, హెలికాప్టర్లు గగనంలో చక్కర్లు కొట్టాయి. సముద్ర తీరంలో ఐఎన్ఎస్ (INS) విక్రమాదిత్య, విక్రాంత్, జలాశ్వ యుద్ధనౌకల విన్యాసాలు చూపరులను మంత్రముగ్దుల్ని చేశాయి. నేవీకి చెందిన తేజస్, మిగ్ విమానాల విన్యాసాలు అబ్బురపరచాయి. చేతక్, కమడోర్, పీఐ 8, సీకింగ్ హెలికాప్టర్ల ప్రదర్శనలు అలరించాయి.
8 వేల మీటర్ల ఎత్తు నుంచి పారాచూట్ల సాయంతో వేదిక వద్ద దిగిన నావికులు ముఖ్య అతిథి అజయ్ భట్‌కు జ్ఞాపిక అందించారు. రష్యా, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ దేశాల నేవీ, ఎన్సీసీ (NCC) బృందాలు ఆర్కే బీచ్‌లో ఓపెన్ పరేడ్ చేశాయి. విన్యాసాల అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. గరగ, థింసా, తప్పిటగుళ్లు, కొమ్ము కొయ్య, పులి వేషాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో వివిధ దేశాల దౌత్య అధికారులు, నేవీ అధికారులు పాల్గొన్నారు.