ఈనాడు స్వర్ణోత్సవానికి సూక్ష్మ కళాఖండంతో శుభాకాంక్షలు - golden Micro Art of Eenadu
🎬 Watch Now: Feature Video
Micro Artist Special Art of Eenadu 50 years Anniversary : కళాకారుల ప్రతిభను గుర్తించి వాళ్లను పైకి తీసుకురావడంలో ఈనాడు ఎప్పుడు ముందు ఉంటుందని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కొత్తపల్లి రమేష్ ఆచారి చెప్పారు. సూక్ష్మ కళాఖండాలు తయారు చేస్తున్న తనకు ఈనాడు వల్లే అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. ఈనాడు స్వర్ణోత్సవం సందర్భంగా 250 మిల్లీ గ్రాముల బంగారాన్ని ఉపయోగించి పలుచటి బంగారు రేకుపై ఈనాడుకు 50 వసంతాలు అని చెక్కి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
2019 లో తాను మొట్ట మొదటి సారి సూక్ష్మ బంగారు ప్రపంచ కప్‌ని తయారు చేశానన్నారు. దాన్ని ఈనాడు పత్రిక ప్రచురించడంతో అది తనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈనాడు ద్వారా వచ్చిన గుర్తింపుతో ఇప్పటికీ 8 ప్రపంచ రికార్డుల్లో తన పేరు నమోదు అయిందన్నారు. ఈనాడుకు ఎప్పుడూ రుణపడి ఉన్నానని రమేష్ ఆచారి అన్నారు. ఈనాడులో పత్రిక అంటే వారికెంతో ఇష్టమని తెలిపారు.