పెన్సిల్‌పై బాలకృష్ణుడు- సూక్ష్మకళాకారుడి అద్భుత ప్రతిభ - Lord Krishna Idol on Pencil Lead - LORD KRISHNA IDOL ON PENCIL LEAD
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 25, 2024, 3:33 PM IST
|Updated : Aug 25, 2024, 3:45 PM IST
Micro Artist Created Picture of Lord krishna on Pencil: శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని ఓ సూక్ష్మ కళాకారుడు బాలకృష్ణుడి రూపాన్ని రూపొందించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన గట్టెం వెంకటేష్ పెన్సిల్‌పై కృష్ణుడి రూపాన్ని తయారు చేశాడు. గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన వెంకటేష్ సుమారు ఆరు గంటల పాటు శ్రమించి ఈ సూక్ష చిత్రాన్ని పెన్సిల్ ముల్లుపై మలిచాడు. అద్భుతంగా తయారు చేసిన బాలకృష్ణుడు బొమ్మను చూసి పలువురు వెంకటేష్‌ను అభినందించారు.
ఇటీవల సూక్ష్మ కళాకారుడు (Micro Artist) వెంకటేష్ పెన్సిల్ ముల్లుపై హనుమంతుడి చిత్రాన్ని సైతం రూపొందించారు. దీని తయారీకి నాలుగు గంటల సమయం పట్టినట్లు వెంకటేష్ తెలిపారు. ఉపమాక వెంకన్న ఆలయానికి త్రీడీ నమూనా కూడా సిద్ధం చేశాడు. 25 రోజులపాటు శ్రమించి ఆరు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో రూపొందించారు. గతంలో ఆలయాల నమూనాలను సైతం వెంకటేష్ రూపొందించారు.