అక్రమంగా మెఫ్టెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ - Hyderabad Mephentermine Injections
🎬 Watch Now: Feature Video
Published : Feb 6, 2024, 2:01 PM IST
|Updated : Feb 6, 2024, 3:04 PM IST
Mephentermine Sulfate Injections Case In Hyderabad : మెఫ్టెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లను అధిక ధరకు అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరిని శంషాబాద్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ టీమ్ సంయుక్తంగా అరెస్టు చేశారు. వారి నుంచి 30 మెఫ్టైర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్స్, 4 సిరంజీలు, 3 చరవాణులు, రూ.3 వేలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీటి విలువ రూ. 2లక్షల 41 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : హైదరాబాద్ శివారులోని పహాడి షరీఫ్‌కు చెందిన మహ్మద్ అజాజ్ మొహియుద్దిన్ గతంలో జిమ్ వర్కౌట్ చేసే సమయంలో ఈ ఇంజెక్షన్ గురించి తెలుసుకున్నాడు. జిమ్ వర్కట్ చేసే వారిలో కండరాల అభివృద్ధికి ఇవి బాగా పని చేస్తాయని చెప్పి వారికి నిందితులు వీటిని అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. 200 రూపాయల విలువైన వీటిని రూ. 2వేలకు అమ్ముతున్నారని వెల్లడించారు. మరోవైపు జిమ్ చేసే వారికి ఈ ఇంజెక్షన్లు వాడితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్‌లు కచ్చితంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారని, అందుకే వీటిని వినియోగించకూడదని పోలీసులు సూచించారు.