LIVE : పద్మవిభూషణ్ చిరంజీవితో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిట్‌చాట్ - CHIRANJEEVI KISHAN REDDY INTERVIEW - CHIRANJEEVI KISHAN REDDY INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : May 10, 2024, 9:02 AM IST
|Updated : May 10, 2024, 10:26 AM IST
Megastar Chiranjeevi interview with Kishan Reddy : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పద్మవిభూషణ్ చిరంజీవి వేసిన పలు ప్రశ్నలకు కిషన్‌రెడ్డి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. జీ20 మీటింగ్ శ్రీనగర్ లో పెట్టడానికి మోదీ అన్ని రకాలుగా సహకరించారు. ఇప్పుడు ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత గత రెండు సంవత్సరాల్లోనే దాదాపు 300 పైగా సినిమా షూటింగులు కాశ్మీర్లో జరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే గత ప్రభుత్వాలు ఎప్పుడు మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారటానికి టార్గెట్ పెట్టుకోలేదు. కానీ 2047 సంవత్సరానికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారి ఎర్రకోట నుండి జెండా ఎగురవేయడమే మోదీ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా తెలుగు జాతి గర్వపడే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సమయంలో వారిని కలిసి అభినందించిన సందర్భంగా జరిగిన ఆత్మీయ భేటీ అంటూ కిషన్‌రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇప్పుడు వారిద్దరి ఇంటర్వ్యూను ఈటీవీ భారత్‌లో చూసేద్దాం.
Last Updated : May 10, 2024, 10:26 AM IST