కృష్ణానదీ జలాల వివాదంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు కౌంటర్ - ప్రత్యక్షప్రసారం - బీఆర్‌ఎస్
🎬 Watch Now: Feature Video
Published : Feb 4, 2024, 5:46 PM IST
|Updated : Feb 4, 2024, 6:12 PM IST
Meeting of BRS LB Nagar Activists in Hastinapuram LIVE : కృష్ణా నదీ జలాల వివాదంపై(Krishna Water Disputes) ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. సదరు ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయన్నారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆక్షేపించారు.
Harish rao Counters to CM Revanth Reddy : 2021లో కేంద్రం గెజిట్ ఇచ్చి ఒత్తిడి తీసుకొచ్చినా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించలేదన్న హరీశ్‌రావు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాకముందే ప్రాజెక్టులు ఇచ్చేందుకు అంగీకరించారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఎవరో దీంతోనే స్పష్టం అవుతోందని, తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకోవాలని కోరారు. తాను రాజకీయాల కోసం మాట్లాడడం లేదన్న ఆయన, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలని అన్నారు. మేధావులు మౌనం వీడాలని కోరారు.