బర్డ్​ఫ్లూ అప్రమత్తత- చికెన్​ విక్రయాలకు ఫుల్​స్టాప్​ - నెల్లూరు జిల్లాలో బర్డ్​ఫ్లూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 4:35 PM IST

Meet Seized Due To Bird Flu In Nellore District : నెల్లూరు జిల్లాలో బర్డ్​ఫ్లూ (Bird Flu) ఎఫెక్ట్ విషయంలో​ అధికారులు అప్రమత్తం అయ్యారు. చికెన్ విక్రయాలు వంటకాలపై  సంబంధిత అధికారులు నిషేధాజ్ఞలు విధించారు. చికెన్ విక్రయాలపై  నెల్లూరు నగరంలో చికెన్ విక్రయ కేంద్రాలపై ఆరోగ్య విభాగం అధికారులు మెరుపు దాడులు చేశారు. పలుచోట్ల భారీగా ఉన్న మాంసం (Meet) నిల్వలను సీజ్ చేశారు. చికెన్ విక్రయాలపై నిషేదాలను విధించారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్ అధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించ్చారు. 

Chicken Shops Closed To Control Bird flu : బర్డ్ ఫ్లూ చికెన్ (Chicken) విక్రయాలతో వ్యాపారం చేయవద్దని వైద్యులు (Doctors) పిలుపునిచ్చారు. జిల్లాలో బర్డ్​ఫ్లూ ప్రభావం తగ్గే వరకు సహకరించాలంటూ చికెన్ విక్రేతలకు సూచన చేశారు. బర్డ్​ఫ్లూ పైన ప్రజలందరికి అవగాహన కల్పించడానికి  సహకరించాలని కోరారు. బర్డ్​ఫ్లూ తగ్గే వరకు అమ్మకాలు నిలిపివేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.