రోడ్డు ప్రమాదంలో మెడికో దుర్మరణం- హాస్టల్‌కు వెళ్తుండగా ఢీకొట్టిన బస్సు - ACCIDENT AT KURNOOL - ACCIDENT AT KURNOOL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 4:31 PM IST
Medical Student Died In Road Accident AT Kurnool : ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో కర్నూలులో వైద్య విద్యార్థి మృతి చెందాడు. కళాశాల నుంచి హాస్టల్‌కు బైక్‌పై వెళ్తుండగా బస్సు వెనుక నుంచి ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతుడు సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన తేజేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు. ఇతడు కర్నూలు మెడికల్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం. మెడికల్ కాలేజ్ రీడింగ్ రూమ్‌లో చదువుకొని హాస్టల్‌కి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరగినట్లు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు తేజేశ్వర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
ఆ రోజుల్లో పెచ్చుమీరిపోతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రయాణాలు అంటేనే జంకుతున్నారు. మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్న వేరేవాళ్ల నిర్లక్ష్యం లేదా మరో కారణంతోనో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తేజేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.