నాగార్జునసాగర్‌కు పోటెత్తుతున్న కృష్ణమ్మ - 22 గేట్లు ఎత్తి నీటి విడుదల - NAGARJUNA SAGAR 22 GATES LIFTED - NAGARJUNA SAGAR 22 GATES LIFTED
🎬 Watch Now: Feature Video
Published : Aug 6, 2024, 1:36 PM IST
|Updated : Aug 6, 2024, 2:49 PM IST
Nagarjunasagar 22 Gates Lifted : నాగార్జునసాగర్ జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం 22 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.30 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి ఇన్‌ఫ్లో 3,74,649 క్యూసెక్కుల నీరు వస్తోంది.
సాగర్ క్రస్ట్ గేట్లలో 16 గేట్లను 10 అడుగుల మేరకు ఎత్తి, మరొక నాలుగు గేట్లను ఐదు అడుగుల మేరకు లిఫ్ట్ చేసి స్పిల్‌వే ద్వారా రెండు లక్షల 55వేల 296 క్యూసెక్కుల నీరు దిగువనకు విడుదల చేస్తున్నారు. సాగర్ ఔట్‌ఫ్లో 3,54,684 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ జలాశయం కుడి ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతుంది. మరొక ఆరు గేట్లను వరద ప్రవాహాన్ని బట్టి ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.