ఫర్నీచర్ దుకాణంలో అగ్నిప్రమాదం - మంటలను అదుపుచేసిన ఫైర్ సిబ్బంది - Fire Break Out In Furniture shop - FIRE BREAK OUT IN FURNITURE SHOP
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2024, 10:13 AM IST
Fire Break Out In Furniture shop In Hyderabad : ఓ ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ఈ ఘటన హైదరాబాద్లోని మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఆస్తినష్టం జరిగినట్లుగా సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్లేపల్లిలో మంగళవారం రాత్రి ఒంటిగంట సమయంలో అల్ అమ్ర ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కొంత సమయం పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. అంతకు ముందు ఘటనా స్థలానికి పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లోని సిలిండర్లను ముందుగా అక్కడ నుంచి స్వాధీనం చేసుకుని దూరంగా ఉంచారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ కాస్త ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.