LIVE : కెంగేరిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ 119వ శాఖ ప్రారంభోత్సవం - ప్రత్యక్షప్రసారం - MARGADARSI BRANCH AT KENGERI LIVE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2024, 11:07 AM IST
|Updated : Dec 11, 2024, 12:04 PM IST
Margadarsi Branch at Kengeri Live : నమ్మకానికి చిరునామాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ నిలిచింది. సవాళ్లకు ఎదురునిలిచి లక్షలమంది ఆర్థికనేస్తంగా ఖాతాదారుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కలలు మీవి, వాటికి సాకారం చేసే ఆర్థిక సహకారం మాది అంటూ నిరంతరాయంగా, నిర్విరామంగా సేవలు అందిస్తూ వస్తోంది. అనతికాలంలోనే ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంది. ఇంటి నిర్మాణం, వ్యాపార ప్రారంభం, విస్తరణ, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, చింతలేని పదవీవిరమణ జీవితం ఇలా అవసరమేదైనా అందరి ఏకైక ఎంపికగా నిలిచింది మార్గదర్శి. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావం, రాజీలేని యాజమాన్యం విశ్వసనీయతతో సంస్థ అంతే వేగంగా అభివృద్ధి చెందింది. కార్యకలాపాలు శరవేగంగా విస్తరించాయి. నమ్మకం అనే పునాదులపై చెక్కుచెదరని భవంతిగా వెలుగులీనుతోంది మార్గదర్శి. ఈ క్రమంలోనే తన 119వ బ్రాంచ్‌ను కర్ణాటకలో కెంగెరీలో, 120వ శాఖను తమిళనాడులోని హోసూర్‌లో ఇవాళ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే కెంగేరీలో ఏర్పాటు చేసిన మార్గదర్శి 119వశాఖ ప్రారంభోత్సవంలో ఎండీ శైలజా కిరణ్ పాల్గొన్నారు.
Last Updated : Dec 11, 2024, 12:04 PM IST