LIVE : కర్ణాటక చిక్‌బళ్లాపురలో మార్గదర్శి చిట్స్ 115వ శాఖ ప్రారంభోత్సవం - Margadarsi New Branch Open - MARGADARSI NEW BRANCH OPEN
🎬 Watch Now: Feature Video
Published : Oct 7, 2024, 10:55 AM IST
|Updated : Oct 7, 2024, 11:17 AM IST
Margadarsi 115th New Branch Opening in Karnataka : తెలుగువారికి సుపరిచితమైన మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ కర్ణాటకలోని చిక్‌బళ్లాపురలో మరో నూతన బ్రాంచ్‌ను ఇవాళ ప్రారంభించింది. మార్గదర్శి సంస్థకు మొత్తంగా 115వ బ్రాంచ్ ఇది. నూతన శాఖను సంస్థ ఎండీ శైలజా కిరణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తంగా ఉందని ఖాతాదారులు హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకులతో పోలిస్తే సులభంగా తాము డబ్బును పొందుతున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా తమకు ఆర్థిక అండగా నిలిచిందని కొనియాడారు. వేల కుటుంబాలు చిట్స్ కడుతున్నాయన్న ఖాతాదారులు డబ్బు తీసుకునేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని తేల్చి చెప్పారు. మార్గదర్శి సంస్థకు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొంటున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరు పొదుపు పాటించినట్లయితే ఆర్థికపరంగా ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ అధికారులు చెబుతున్నారు.
Last Updated : Oct 7, 2024, 11:17 AM IST