జగన్ పార్టీలో కేవలం ముగ్గురు ఎంపీలే మిగులుతారు: మాణికం ఠాగూర్ - YSRCP MPs Ticket
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 31, 2024, 7:46 PM IST
Manickam Tagore Tweet: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏపీ కాంగ్రెస్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా తమ గళం వినిపిస్తున్నారు. సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను ఎండగడూతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ సైతం వైఎస్సార్సీపీ తీసుకునే నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీలో టికెట్లు దక్కని పలువురు నేతలు ఇతరపార్టీలవైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో మాణికం ఠాగూర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
వైఎస్సార్సీపీలో సమన్వయకర్తల మార్పులు, చేర్పులపై అసంతృప్తితో ఆ పార్టీకి నాయకుల రాజీనామా చేస్తుండటంపై, ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ట్విట్టర్ (ఎక్స్ ఖాతా)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. జగన్ పార్టీలో కేవలం ముగ్గురు ఎంపీలే మిగులుతారని తనకు సమాచారం ఉందన్నారు. ఇది ఎంత గొప్ప రాజకీయ వ్యవస్థో అంటూ పేర్కొన్నారు. ఇంఛార్జుల మార్పుతో చాలామంది నేతలు ఇటీవల వైఎస్సార్సీపీని వీడుతుండటాన్ని ప్రస్తావిస్తూ మాణికం ఠాగూర్ ఈ మేరకు స్పందించారు