ఒంటిపై కిలో బంగారంతో యాదాద్రిని దర్శించుకున్న 'గోల్డ్‌మేన్' - ఫొటోలు దిగేందుకు పోటీపడ్డ భక్తులు - man wearing 1kg gold
🎬 Watch Now: Feature Video


Published : Feb 26, 2024, 10:26 AM IST
Man Wearing 1kg Gold In Yadadri : బంగారం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. పసిడి అభరణాలు ధరించడానికి ఎక్కువగా మహిళలు ఆసక్తి చూపుతుంటారు. ఒంటిపై సుమారు 99 తులాల బంగారంతో యాదాద్రిలో హైదరాబాద్‌కు చెందిన దుర్గం శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి సందడి చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్టతో పాటు అనుబంధ పాతగుట్ట ఆలయానికి దర్శనార్థమై వచ్చి, తన ఫ్యామిలీతో ఆలయ పరిసరాల్లో సరదగా గడిపారు. ఆయనతో ఫొటోలు దిగడానికి పలువురు భక్తులు, స్థానికులు పోటీపడ్డారు. అతను స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒంటిపై బంగారంతో తిరగడం సెంటిమెంట్‌గా కలిసి రావడంతో ఎక్కువ మొత్తంలో బంగారం ధరించినట్లు ఆయన తెలిపారు.
1kg Gold Wearing Man : తమ ఇలవేల్పు లక్ష్మీ నరసింహ స్వామి బంగారు చిత్రం తన హృదయంపై ఉంటుందని, ఆయనే తనకు రక్ష అని శ్రవణ్ పేర్కొన్నారు. కాగా మార్కెట్ ధరల్లో ఒక కిలో బంగారం ధర ప్రస్తుతం రూ.65 లక్షల వరకు ఉంది. ఇంత విలువైన సొమ్ముతో తిరగడం చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.