దాహంతో కిటికీ వద్ద దీనంగా వానరం - నీళ్లు తాగించి మానవత్వం చాటుకున్న భక్తుడు - man gave monkey water Video - MAN GAVE MONKEY WATER VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Apr 23, 2024, 7:25 PM IST
Man Helps Monkey Drink Water in Jagtial : వేసవి కాలం కావడంతో ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. పలు గ్రామాల్లో చెరువుల్లో నీళ్లు ఆవిరి అయిపోవడంతో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయాల్లో నీటి కోసం మూగజీవులు అల్లాడుతున్నాయి. దాహంతో నీటి కోసం పరుగులు తీస్తున్నాయి. అలానే ఓ కోతి దాహంతో పరుగులు తీస్తుండగా, ఓ వ్యక్తి గమనించి చిన్న గ్లాసులో నీళ్లు పెట్టి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
Monkey Drink Water at Kondagattu : జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయానికి వెళ్లాడు. ఈ క్రమంలో అతను భోజనం చేస్తుండగా కిటికి దగ్గర ఓ వానరం నీటి కోసం అల్లాడుతున్న దృశ్యాన్ని గమనించాడు. దీంతో అతనికి మనసు చలించిపోయి, ఓ చిన్న టీ గ్లాసులో నీళ్లు పెట్టాడు. ఆ కోతి నీళ్లు తాగి దాహాన్ని తీర్చుకుంది. ఈ దృశ్యాన్ని అక్కడున్న భక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.