ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - విజయ రహస్యం అదేనట - Man Got Three Government Jobs - MAN GOT THREE GOVERNMENT JOBS
🎬 Watch Now: Feature Video


Published : Apr 10, 2024, 5:22 PM IST
Man Got Three Government Jobs : ఉపాధ్యాయ వృత్తిపై ఆ యువకుడికి ఆపారమైన గౌరవం. టీచర్ అయితే కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు సమాజంలో గౌరవం దక్కుతుందని బలంగా నమ్మాడు. అందుకోసం అధ్యాపకుడు కావడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఫలితంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమే గాక పీజీటీ, జేఎల్‌లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించి ఔరా అనిపించాడు.
అతడే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బొమ్మకంటి స్వామి, బొమ్మకంటి యాదయ్య, లక్ష్మమ్మల కుమారుడు. స్వామి 26 ఏళ్లకే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2012లో పదోతరగతి పాసయ్యారు. ఏపీఆర్జేసీలో సర్వల్లో ఇంటర్ పూర్తిచేశారు. నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటకల్ సైన్స్‌లో పీజీ పూర్తైంది. పీజీటీలో రాష్ట్రంలో మొదటి ర్యాంక్, జేఎల్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంక్, డీఎల్ మల్టీజోన్ లో రాష్ట్రంలో రెండో ర్యాంక్ సాధించారు. 26 ఏళ్ల వయసులోనే 3 ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాడో ఆ యువకుడి మాటల్లోనే విందాం.