మద్యం సేవిద్దామని పిలిచాడు- కత్తితో పొడిచేశాడు - Knife attack
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 1:19 PM IST
Man Attack With Knife During Alcohol Consumption: మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తి కత్తిపోటుకు దారి తీసింది. తీవ్ర రక్తస్రావం అయిన బాధితుడు ప్రాణాప్రాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలివీ.
కొత్తూరి అనిల్ కుమార్ (29) క్యాటరింగ్ చేస్తుంటాడు. ఇతనికి స్థానికుడు ముప్పిడి గంగారావు (19)తో పరిచయం ఉంది. ఈ క్రమంలో మద్యం సేవించడానికి (Drinking alcohol) అనిల్ కుమార్‌ను గంగారావు పిలిచాడు. మద్యం సేవిస్తూ ఉండగా ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో గంగారావు వెంట తెచ్చుకున్న కత్తి (Knife)తో అనిల్ పొట్టలో పొడిచాడు. తీవ్ర రక్త స్రావంతో పడి ఉన్న అనిల్‌ను గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏరియా ఆసుపత్రి నుంచి ఏలూరు వైద్యశాలకు తరలించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని ఘటనకు గల కారణాలను దర్యాాప్తు చేస్తున్నారు.