ఫుడ్ బాగాలేదంటూ మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా - Malla Reddy University Students Protest - MALLA REDDY UNIVERSITY STUDENTS PROTEST
🎬 Watch Now: Feature Video
Published : Jun 7, 2024, 10:21 PM IST
Malla Reddy University Students Protest on Hostel Food : గత కొద్ది నెలలుగా నాణ్యత లేని ఆహారం పెడుతున్నారంటూ మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేసినా వారికి ఇంకా తిప్పలు తప్పట్లేదు. ఎన్ని సార్లు కళాశాల యాజమాన్యానికి మొర పెట్టుకున్నా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూపట్లేదని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మైసమ్మ గూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో గురువారం రాత్రి నుంచి బాయ్స్ హాస్టల్లో నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని, అన్నంలో పురుగులు వస్తున్నాయని కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
తమకు పెట్టే ఆహారం ఒకసారి తినండి, లేదా తాము కట్టిన ఫీజులు తిరిగి ఇవ్వాలంటూ కళాశాల వసతి గృహం ముందు విద్యార్థులు బైఠాయించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైటికి చెప్తే తమను చదువు విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా కళాశాల యాజమాన్యం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.