మలక్‌పేటలో ఫ్రీం హలీం ఎఫెక్ట్ - పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల లాఠీచార్జ్ - Malakpet Free Haleem Incident
🎬 Watch Now: Feature Video


Published : Mar 12, 2024, 10:46 PM IST
Malakpet Free Haleem Incident : హలీమ్, ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికీ నోరూరాల్సిందే. నవాబుల డైనింగ్ టైబుల్ మీద ఒకప్పుడు గర్వంగా నిలిచిన హలీం, ఇప్పుడు గరీబులకూ ఫేవరెట్ డిష్‌గా మారింది. అటువంటి రంజాన్ మాసపు వంటకం ఫ్రీగా దొరుకుతుందంటే ఇంక ఏమైనా ఉందా? అందులోనూ హైదరాబాద్ హలీం అంటే జనాలు ఏవిధంగా ఎగబాకుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటువంటి ఉచిత రంజాన్ ప్రారంభ ఆఫర్‌నే ప్రకటించింది మలక్‌పేట్‌లోని హజీబో హోటల్.
రంజాన్ మాసం సందర్భంగా ఇవాళ(మంగళవారం) ఒక్క రోజు ఉచితంగా హలీం ఇస్తామని చెప్పడంతో భారీగా జనం బారులు తీరారు. రాత్రి గం.7 నుంచి 8గం వరకూ ఫ్రీగా హలీం అందిస్తామంటూ హజీబో నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో భారీగా జనం రావడంతో రెస్టారెంట్ వద్ద గందరగోళం తలెత్తింది. మరోవైపు హోటల్ వద్దకు భారీగా జనం గుమిగూడటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో భారీ జనాలను అదుపు చేయలేక పోలీసులకు హోటల్ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. వందలాది మందిని అదుపుచేసే క్రమంలో పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు.