LIVE : గురుదేవ్ రవిశంకర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు - Maha Shivratri 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 8, 2024, 9:02 PM IST
|Updated : Mar 9, 2024, 6:03 AM IST
GURUDEV RAVISHANKAR LIVE : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో, శ్రీకాళహస్తిలో, అమరావతిలోని అమర లింగేశ్వర స్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తులు వివిధ శైవ క్షేత్రాలకు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులకు ఉచిత అన్నప్రసాదం, అల్పాహారాన్ని కూడా అందిస్తున్నారు. ఆలయాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కాగా శివరాత్రిని పురస్కరించుకుని బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ (Art of Living International Centre) నుంచి ప్రముఖ ధ్యాన గురువు రవిశంకర్ సమక్షంలో శివ పూజలు, భజనలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Mar 9, 2024, 6:03 AM IST