శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా పల్లకీ సేవ- ముగిసిన ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు - Sri Kalahasteeshwara Pallaki Seva

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 4, 2024, 2:25 PM IST

thumbnail
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా పల్లకీ సేవ - ముగిసిన ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు (ETV Bharat)

Maha Pallaki Seva Performed Grandly at Sri Kalahasteeshwara Alayam: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పల్లకీ సేవ ఘనంగా జరిగింది. ఈ వేడుకతో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సోమ స్కంధమూర్తి సమేత శ్రీజ్ఞాన ప్రసూనాంబికాదేవి, కుమారస్వామి వేర్వేరుగా పల్లకీలను అధిరోహించి మాఢ వీధుల్లో ఉత్సవమూర్తులుగా భక్తులకు దర్శనమిచ్చారు. అమావాస్య, పల్లకీ ఉత్సవాలను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి  దేవతామూర్తులను దర్శించుకున్నారు. కర్పూర నీరాజనాలు సమర్పించి శివ నామ స్మరణలతో పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయంలో పల్లకి సేవతో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 

వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం: శ్రీకాళహస్తీశ్వరాలయం మార్చి 3 నుంచి స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సుందరీకరించారు. భక్త కన్నప్ప కొండపై నిర్వహించే కైలాసనాథస్వామి ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో దేవతామూర్తులు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.