'మా కుటుంబ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటున్నా- వైసీపీకి రాజీనామా చేస్తున్నా' - AP Latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 10:59 AM IST
|Updated : Feb 28, 2024, 11:05 AM IST
Magunta Sreenivasulu Reddy Resign to YSRCP: కొన్ని అనివార్య కారణాల వల్ల తాను వైఎస్సార్సీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీ మాగుంట తెలిపారు. ఇవాళే పార్టీకి రాజీనామా చేస్తున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. వైఎస్సార్సీపీని వీడటం బాధాకరమే అయినా తప్పటం లేదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని నిర్ణయించినట్లు ఈ సందర్భగా ఆయన వెల్లడించారు. ఒంగోలు ఎంపీగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు.
సీఎం జగన్‌ను తమ కుటుంబ సభ్యుడిగా చూశామని ఎంపీ మాగుంట తెలిపారు. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్న ఆయన 11 సార్లు చట్టసభలకు పోటీ చేశానని చెప్పారు. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని, తమకు అహం లేదని, ఉన్నదల్లా ఆత్మాభిమానం మాత్రమే అని పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఉన్న గౌరవం నిలబెట్టుకోవాలని భావిస్తున్నానంటూ ఐదేళ్లు సహాయ సహకారాలు అందించిన జగన్‌కు ధన్యావాదాలు తెలిపారు. జిల్లా ప్రజలు తమ కుటుంబానికి మద్దతుగా నిలవాలని ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విజ్ఞప్తి చేశారు.