కూచిపుడి ప్రఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలి : మాధవిపెద్ది మూర్తి - kuchipudi Workshop in Hyderabad - KUCHIPUDI WORKSHOP IN HYDERABAD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 6:00 PM IST

Madhavapeddi Murthy Attended kuchipudi Workshop : కూచిపుడి నాట్యం లాంటి కళను మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రోత్సహించి, దేశ ప్రఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని మాధవపెద్ది మూర్తి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ మియాపూర్‌లో జరుగుతున్న నాట్యకల్ప స్కూల్‌ ఆఫ్ కూచిపుడి వర్క్‌షాప్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈయన తండ్రి, ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సత్యం పేరిట అవార్డులు అందజేశారు. 

బాలీవుడ్ సినీ నటి ఎంపీ హేమమాలినితో కలిసి వందలాది శివపార్వతుల నృత్యాలు వివిధ దేశాల్లో వేసినట్లు ఆయన తెలిపారు. కూచిపుడి నృత్యాన్ని అన్ని పాఠశాలల్లో విధిగా ఉండే విధంగా చేయాలని ఆయన కోరారు. కూచిపుడి నృత్యం, యోగా వంటి వాటి ద్వారా సృజనాత్మకత పెరిగి మానసిక ప్రశాంతత ఉంటుందని పేర్కొన్నారు. వీటి ప్రాముఖ్యతను రాబోయే తరానికి, ఇతర దేశాలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాగా వర్క్‌షాప్‌కు వచ్చిన విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.