లారీలో అకస్మాత్తుగా మంటలు- చాకచాక్యంగా తప్పించుకున్న డ్రైవర్ - Lorry Fire Accident - LORRY FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 3:03 PM IST
Lorry Fire Accident in Kurnool District : అట్టపెట్టెలతో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా కొడుమూరు మండలం (kodamuru Mandal) కొత్తూరు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. అట్టపెట్టెలతో హైదరాబాద్కు వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు. ప్రస్తుతం ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Kodumuru Kurnool District : లారీలో మంటలు చెలరేగిన విషయాన్ని గమనించిన డ్రైవర్ హైదర్ అలీ చాకచాక్యంగా తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. డ్రైవర్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ నుంచి ఎగిసి పడుతున్న మంటలను ఆర్పడానికి వారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు డ్రైవర్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటల్లో దగ్ధమవుతున్న లారీని చూసి అటుగా వెళ్తున్న వాహనదారులు భయాందోళన చెందారు.