సుల్తాన్ బజార్లో వెరైటీ వినాయకుడు - రైల్వే గణేశ్‌ను చూస్తే వావ్ అనాల్సిందే - RAILWAY MODEL GANEH IDOL IN HYD - RAILWAY MODEL GANEH IDOL IN HYD
🎬 Watch Now: Feature Video
Published : Sep 11, 2024, 7:37 PM IST
Gokul Railway Ganesh in Hyderabad : హైదరాబాద్ నగరమంతా వినాయక నవరాత్రులతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నగర వ్యాప్తంగా భక్తులు స్వామివారిని వివిధ రూపాలలో కొలువుదీర్చారు. సుల్తాన్ బజార్ లో ఏర్పాటు చేసిన రైల్ నమూనా గణపతి చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ లో కోఠి గోకుల్ రైల్వేస్ నిర్వాహకులు ప్రతి ఏటా గణేశ్ విగ్రహాన్ని వినూత్నంగా ఏర్పాటు చేస్తారు.
గోకుల్ రైల్వే నమూనాతో విగ్రహ ఏర్పాటు: గోకుల్ రైల్వేస్ నమూనాతో కూడిన గణనానాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రవేశ ద్వారం వద్ద రైలు బొమ్మతో పాటు షెడ్యూళ్ల వివరాలతో కూడిన నమూనానును ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్లగానే టిక్కెట్ కౌంటర్లో ఓ వ్యక్తి దర్శనమిస్తారు. చిన్నసైజ్ రైల్, పీసీ, ఛాయ్, క్యాంటీన్లో కూల్ డ్రింక్స్, చిప్స్ అమ్ముతూ ఇద్దరు వ్యక్తులు, ప్రయాణికుల బొమ్మలు మొదలైనవి ఉన్నాయి. ఈ విధంగా రైలు ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు నిర్వాహకులు సెట్టింగ్ ఏర్పాటు చేశారు. వినాయక విగ్రహాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.