LIVE : లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం - ప్రత్యక్ష ప్రసారం - Lok Sabha Sessions 2024 Live
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 24, 2024, 10:34 AM IST
|Updated : Jun 24, 2024, 1:22 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-06-2024/640-480-21781218-thumbnail-16x9-lok-sabha-session.jpg)
Lok Sabha Sessions 2024 Live : పార్లమెంట్ ఎన్నికల అనంతరం మొదటిసారి లోక్‌సభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి 18వ లోక్‌సభ సమావేశాలు మొదలు కానున్నాయి. ఎంపీలుగా ఎన్నికైన కొత్త సభ్యులచే ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారణ చేయించనున్నారు. కాగా ఇవాళ, రేపు లోక్‌సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం దానిపై చర్చా కార్యక్రమం ఉంటుంది. కాగా ఈ సారి ప్రతిపక్ష నాయకులు నంబర్ సైతం బాగానే ఉంది. కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. మూడోసారి అధికారం చేపట్టాలన్న ఆకాంక్షల మధ్య ఈ బడ్జెట్ తీసుకొచ్చింది. గతేడాది మాదిరిగా ఈసారి కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌నే ప్రవేశ పెట్టారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తయారుచేసిన ట్యాబ్ ద్వారా మంత్రి బడ్జెట్‌ను చదివారు. కేంద్ర ఆర్థిత మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు.