వంతెన మధ్యలో ఆగిపోయిన రైలు- లోకో పైలట్ల సాహసం- నెట్టింట ప్రశంసలు - loco pilot repaired train on bridge - LOCO PILOT REPAIRED TRAIN ON BRIDGE
🎬 Watch Now: Feature Video
Published : Jun 23, 2024, 11:23 AM IST
Loco Pilot Repaired Train On Bridge in Bihar : వంతెనపై రైలు ఆగిపోవడం వల్ల సాహసం చేసి ఘోర ప్రమాదం నుంచి తప్పించిన లోకో పైలట్లపై ప్రశంసలు వర్షం కురుస్తోంది. బిహార్‌లోని సమస్తీపుర్ రైల్వే జంక్షన్లో బాల్మీకి నగర్, పనియావ స్టేషన్ల మధ్య ఉన్న వంతెనపై ఓ రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. రైలు ఇంజిన్‌కు వచ్చే ప్రెజర్ వాల్వ్ లీక్ అవ్వడం వల్లే ఆగిపోయిందని లోకో పైలట్లు గుర్తించారు. బ్రిడ్జిపై రైలు ఎక్కువ సేపు ఆగితే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గుర్తించి ధైర్యం చేశారు. అజయ్ కుమార్ యాదవ్ అనే లోకో పైలట్ బ్రిడ్జిపై వేలాడుతూ ఇంజిన్‌లో సమస్య తలెత్తిన ప్రదేశానికి చేరుకున్నారు. ప్రెజర్ వాల్వ్‌ను సరిచేసి గాలి లీక్ కాకుండా చూశారు. ఆయనకు అసిస్టెంట్ లోకో పైలట్ రంజిత్ కుమార్ అండగా నిలిచారు. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఒక్కొక్కరికి రూ.10 వేలు రివార్డు
రైలులో ఉన్న వందలాది మంది ప్రాణాలు కాపాడడంపై లోకో పైలట్లపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇద్దరు లోకో పైలట్లకు చేసిన పనికి చెరో రూ.10 వేల రివార్డును రైల్వే డీఏఎం వినయ్ శ్రీవాస్తవ ప్రకటించారు. వారిని ఆయన అభినందించారు.