అమ్మో చిరుత - పెద్దపల్లి జిల్లా పొత్కపల్లి గ్రామంలో సంచారం - వీడియో వైరల్ - LEOPARD WANDERS IN PEDDAPALLI DISTRICT VIDEO - LEOPARD WANDERS IN PEDDAPALLI DISTRICT VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 6, 2024, 1:28 PM IST
Leopard Migration in Peddapalli District : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పొత్కపల్లి గ్రామంలోని రైల్వే గేటు వద్ద మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు సీసీ పుటేజ్ ఆధారంగా స్థానికులు గుర్తించారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో రైలు గేటు పడిన తర్వాత ప్రజలెవరూ లేకపోవడంతో రహదారిపై నుంచి వ్యవసాయ క్షేత్రాల్లోకి చిరుత పులి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో దృశ్యాలు నమోదు అయ్యాయి.
చిరుత సంచారంతో గ్రామస్థులు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. వెంటనే ఈ విషయంపై గ్రామస్థులు పెద్దపల్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పులి సంచరించిన ప్రాంతంలో అటవీ సిబ్బంది బుధవారం సాయంత్రం పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. కానీ చిరుత పాదముద్రలు లభించలేదని అధికారులు తెలిపారు. అయినా గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం నుంచి చిరుతలు జనావాసాల్లోకి రావడం పరిపాటిగా మారిపోయింది.