thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 29, 2024, 4:37 PM IST

ETV Bharat / Videos

లీపు ఇయర్​లో ఒకటైన జంటలు - వరంగల్​ జిల్లాలో పలు వివాహ వేడుకలు

Leap Year Marriages in Warangal : అందరి జీవితాల్లో పెళ్లి ఒక అద్భుత ఘట్టం. ప్రతి ఏటా పెళ్లి వేడుకలు జరుపుకునే వారిలా కాకుండా దానికి భిన్నంగా ఓ జంట లీపు ఇయర్​లో ఒకటయ్యారు. నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరం వేళ వరంగల్​ జిల్లాలో వివాహాలు జోరుగా జరిగాయి. శాస్త్రీయంగా మంచి రోజే అయినప్పటికీ ఫిబ్రవరి 29న లీపు ఇయర్​ కావడంతో వధూవరులు ఆనందం వ్యక్తం చేశారు.  

A Couple Married In Leap Year at Wardhannapet : ఇవాళ వర్ధన్నపేటలో లీపు ఇయర్​ పురస్కరించుకుని వధూవరులు వివాహ బంధంతో ఒకటయ్యారు. లీపు ఇయర్​ అని తెలిసినా శాస్త్రీయంగా బాగానే ఉందని పురోహితులు చెప్పడంతో జిల్లాలోని పలు చోట్ల అరుదైన వివాహాలు జరిగాయి. ప్రతి సంవత్సరం అందరిలా కాకుండా భిన్నంగా ఫిబ్రవరి 29వ తేదీన వివాహ దినోత్సవం జరుపుకునే అవకాశం తమకే దక్కిందంటూ వధూవరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.