ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు - CBN sign repeal of Land Titling Act - CBN SIGN REPEAL OF LAND TITLING ACT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 13, 2024, 9:17 PM IST
Lawyers Expressing Joy For Repeal of Land Titling Act: వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసి వారి భూమిపై హక్కు లేకుండా కుట్ర పూరితంగా అమలు చేయాలనుకున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేయడం హర్షనీయమని ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టామని న్యాయవాదులు తెలిపారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. సీఎం చంద్రబాబుకు న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ పోలీసులను అడ్డం పెట్టుకొని ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నించారని న్యాయవాదులు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 వేల మంది న్యాయవాదులు, రైతుల ఉమ్మడి విజయమని వారు పేర్కొన్నారు.