సెలవుపై వెళ్తూ రావత్​ సంతకం - వివాదాస్పదంగా జీపీఎస్​పై తాజా గెజిట్‌ - Controversial on GPS Implementation - CONTROVERSIAL ON GPS IMPLEMENTATION

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 13, 2024, 12:58 PM IST

Latest Gazette Notification Controversial on GPS: వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీపీఎస్​ స్థానంలో జీపీఎస్​ను (గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌) అమలులోకి తెస్తూ తీసుకున్న నిర్ణయంపై తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కావడం వివాదాస్పదమవుతోంది. గత నెల 12న అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్​ఎస్​ రావత్ పేరిట ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఆయన సెలవుపై వెళుతూ పెండింగ్ దస్త్రాలు అన్నింటిపైనా సంతకాలు పెట్టారు. వాటిలో జీపీఎస్​ దస్త్రం కూడా ఉంది. జూన్‌ 12న జీవో 54ను విడుదల చేయగా పాత ప్రభుత్వంలోనే రూపొందించిన నోటిఫికేషన్‌ను తాజాగా శుక్రవారం గెజిట్‌లో అప్‌లోడ్‌ చేశారు. 2023 అక్టోబర్‌ నుంచి జీపీఎస్​ అమలులోకి వస్తుందని దానిలో పేర్కొన్నారు. ఇప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చి గత సంవత్సరం అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందనడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.  

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ పథకం తీసుకొస్తానని 2019 ఎన్నికల ముందు జగన్‌ పదేపదే వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారం పేరుతో సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ తెచ్చారు. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించిన పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకంగా చట్టం చేసింది. ఎన్నికల ముందు దీనిపై ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందని అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలో పాత జీఓకు అనుగుణంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం, జీపీఎస్‌ అమలుకు ఇంతవరకు మార్గదర్శకాలే రూపొందించకపోవడం గమనార్హం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.