LIVE : ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణేశుడి దర్శనానికి పోటెత్తిన భక్తులు - ప్రత్యక్షప్రసారం - Ganesh idol set up in Khairatabad - GANESH IDOL SET UP IN KHAIRATABAD
🎬 Watch Now: Feature Video
Published : Sep 7, 2024, 12:54 PM IST
|Updated : Sep 7, 2024, 6:36 PM IST
Khairatabad Ganesh 2024 : ఖైరతాబాద్ గణేశుడుకి తొలి పూజ పూర్తి అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులు మీదగా తొలి పూజలు చేశారు. నేటితో 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ ఏడాది 70 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ సప్తముఖ మహాశక్తి గణేశుడిని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్ గణేశుడిని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రద్దీ కారణంగా రాష్ట్రప్రభుత్వం భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వీరు చూసుకుంటారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు ఏవీ తలెత్తకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సప్తముఖ మహాశక్తి గణపతి విశిష్టతలు ఏడు ముఖాలతో, కుడివైపు ఏడు, ఎడమ వైపు ఏడు చేతులతో మొత్తం 14 చేతులతో దర్శనమిస్తారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అధిక మొత్తంలో పోటెత్తిన భక్తులు క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈటీవీ భారత్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
Last Updated : Sep 7, 2024, 6:36 PM IST