thumbnail

లంక గ్రామాల్లో గోదావరి వరదలు- ఆస్పత్రికి వెళ్లాలన్నా అష్టకష్టాలే - Patient Suffered Due to Floods

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 10:01 AM IST

Patient Suffered Due to Floods at Udumudi Lanka : గోదావరి వరదలతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన లంక గ్రామాల ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉడుముడి లంక గ్రామంలో తాజాగా ఒక హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఉడుముడి లంకకు చెందిన జేమ్స్‌ అనే వ్యక్తికి వెన్నునొప్పి రావడంతో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామం గోదావరి మధ్యలో ఉండటం, నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అవస్థలు పడ్డారు. మంచంపై జేమ్స్‌ను పడుకోబెట్టి నలుగురు వ్యక్తును ఉడుముడి లంక నుంచి గోదావరి రేవు వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో పడరాని పాట్లు పడ్డారు.

ఏళ్ల తరబడి ఇవే సమస్యలతో సతమతమవుతున్నా తమను ఆదుకునే నాథుడే లేడని గ్రామస్థులు వాపోతున్నారు. రోడ్డు సదుపోయం సరిగ్గా లేకపోవడంతో  అంబులెన్స్​ కూడా రాలేని దుస్థితి అని ఆవేదన చెందారు.

 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.